భారతదేశం, జూలై 3 -- క‌మిటీ కుర్రాళ్లు మూవీతో ప్రొడ్యూస‌ర్‌గా తొలి అడుగులోనే బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను అందుకున్న‌ది మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల‌. తెలంగాణ ప్ర‌భుత్వం అంద‌జేసిన గ‌ద్ద‌ర్ అవార్డ్స్‌లో క‌మిటీ కుర్రాళ్లు మూవీ రెండు పుర‌స్కారాల‌ను ద‌క్కించుకున్న‌ది. ప్రొడ్యూస‌ర్‌గా నిహారిక కొణిదెల రెండో మూవీ బుధ‌వారం ప్రారంభ‌మైంది. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెం.2 గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వ‌హిస్తున్నారు. ఫాంట‌సీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో మ్యాడ్ ఫేమ్‌ సంగీత్ శోభన్ హీరోగా న‌టిస్తున్నాడు. అత‌డికి జోడీగా నయన్ సారిక హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.

ఈ సినిమాకు డైరెక్ట‌ర్ మాన‌స శ‌ర్మ‌ కథను అందించ‌గా.... స్క్రీన్ ప్లే, డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల స‌మ‌కూర్చుతున్నారు. నాయ‌కానాయిక...