భారతదేశం, జనవరి 16 -- అమావాస్య తిథికి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి అమావాస్యనాడు చాలామంది రకరకాల పరిహారాలను పాటించడం వంటివి చేస్తూ ఉంటారు. ఈ సంవత్సరం మౌని అమావాస్య జనవరి 18, ఆదివారం నాడు వచ్చింది. ఈ అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం చూస్తే ఈ అమావాస్య ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంటుంది. మౌని అంటే మౌనంగా ఉండడం అని అర్థం. అందుకే అమావాస్య నాడు చాలా మంది మౌన దీక్షను పాటిస్తారు. అలాగే ఈ మౌని అమావాస్య నాడు నదీ స్నానం చేయడం, దానధర్మాలు చేయడం వంటివి ఎంతో శుభప్రదమైన ఫలితాలను తీసుకువస్తాయి.

ఈ మౌని అమావాస్య అనేది మహాశివరాత్రి పండుగకు ముందు వస్తుంది. దీంతో సాధువులు, యోగ సాధకులు మౌని అమావాస్యను చాలా ప్రత్యేకమైనదిగా పరిగణిస్తారు. గంగా, యమునా, సరస్వతీ నదుల సంగమమైన త్రివేణి సంగమంలో స్నానం చేస్తారు.

మౌని అమావాస్య జనవరి 18, ఆదివారం నాడు వ...