భారతదేశం, నవంబర్ 24 -- కలెక్షన్ కింగ్, నట ప్రపూర్ణ మంచు మోహన్ బాబు ఈ ఏడాది సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని హైదరాబాద్‌లో సినీ సెలబ్రిటీలందరికి గ్రాండ్ పార్టీ ఇస్తూ ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు సినీ ఇండస్ట్రీల నుంచి స్టార్ సెలబ్రిటీలు హాజరయ్యారు.

అలాగే, మోహన్ బాబు స్నేహితుడు, సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేశారు. సినీ పరిశ్రమకు చెందిన పలువురు ఈ కార్యక్రమానికి హాజరై మోహన్ బాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరారు.

దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సందర్భంగా తన స్నేహితుడు మోహన్ బాబు గురించి రజనీకాంత్ స్టేజీపై స్పీచ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

"నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని...