భారతదేశం, జూన్ 21 -- కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు, 'హాస్యబ్రహ్మా' బ్రహ్మానందం మధ్య మంచి అనుబంధం ఉంది. గతంలో కొన్ని ఈవెంట్లలో ఈ ఇద్దరు సరదాగా ముచ్చటించుకున్నారు. ఒకరిపై ఒకరు జోక్స్ వేసుకున్నారు. తాజాగా మరోసారి అలాంటిదే జరిగింది. నేడు (జూన్ 21) జరిగిన కన్నప్ప సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో మోహన్ బాబు గురించి సరదాగా మాట్లాడారు బ్రహ్మానందం. ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ ఎందుకు నటించారో, ఆయన పాత్ర ఎలా ఉండనుందో కూడా చెప్పారు.

ప్రపంచం గర్వించదగ్గ నటుడు ప్రభాస్ అని బ్రహ్మానందం అన్నారు. కన్నప్ప సినిమాను ప్రభాస్ డబ్బు కోసమో, గొప్ప క్యారెక్టర్ వచ్చిందో అని అంగీకరించలేదని బ్రహ్మానందం అన్నారు. ప్రభాస్ గొప్ప మానవతా విలువలు ఉన్న మంచి మనిషి అని, ఎవరైనా ఏదైనా అడిగితే ప్రభాస్ కాదనరని చెప్పారు. మోహన్ బాబుకు ప్రభాస్ చాలా సన్నిహితుడు అని, అందుకే ప్రభాస్ ఈ ...