Hyderabad, మే 21 -- మోహన్‌లాల్ మోస్ట్ అవేటెడ్ మూవీ వృషభ వచ్చేస్తోంది. తన 65వ పుట్టిన రోజునాడు ఈ సూపర్ స్టార్ ఈ ప్రతిష్టాత్మక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. నంద కిశోర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను ఏక్తా కపూర్ నిర్మిస్తోంది. ఈ మూవీ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా మూవీ నుంచి తన ఫస్ట్ లుక్ ను కూడా అతడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు.

మోహన్‌లాల్ బుధవారం (మే 21) తన 65వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. ఈ సందర్భంగా వృషభ మూవీ మోషన్ పోస్టర్ ను తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేశాడు. "ఇది ప్రత్యేకం. నా అభిమానులకు అంకితం. ఎదురు చూపులు ఫలించాయి. తుఫాను ప్రారంభమైంది. గర్వం, శక్తితో నేను వృషభ ఫస్ట్ లుక్ ను ఆవిష్కరిస్తున్నాను. మీ మనసు తాకే సినిమా ఇది.

నా పుట్టిన రోజునాడే లాంచ్ చేయడం దీనిని మరింత ప్రత్యేకంగా మార్చేసింది. మీ ప్రేమే నాకె...