భారతదేశం, నవంబర్ 8 -- 2025లో అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఇండియన్ సినిమాల్లో వృషభ ఒకటి. మోహన్‌లాల్ లీడ్ రోల్ ప్లే చేసిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా కన్ఫామ్ చేశారు. ఈ ఏడాది డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా అభిమానులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ ట్రీట్ ఇవ్వబోతున్నట్లు వృషభ మేకర్స్ అనౌన్స్ చేశారు. మూవీ షూటింగ్ ప్రకటించినప్పటి నుంచి వార్తల్లో నిలుస్తున్న ఈ చిత్రం అద్భుతమైన విజువల్స్, పౌరాణిక అంశాలు, భావోద్వేగాల కలయికతో ఒక గ్రాండ్ ఎమోషనల్ గాథగా తెరకెక్కింది.

ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా మోహన్‌లాల్ ఒక సరికొత్త వీడియోను విడుదల చేశారు. ఇందులో సినిమాలోని అద్భుతమైన విజువల్స్, ఆయన శక్తివంతమైన యోధుడి అవతార్‌ను చూపించారు. ఈ క్లిప్‌ను పంచుకుంటూ ఆయన ఇలా రాశారు. "కొన్ని కథలు సినిమా కంటే ఎక్కువ. అవి వారసత్వాలు. ఈ క్రిస్మస్‌కు ఆ వా...