Hyderabad, ఆగస్టు 10 -- యూజెనిక్స్ ఫిల్మ్‌ఫేర్ గ్లామర్ అండ్ స్టైల్ అవార్డ్స్ సౌత్ 2025 కార్యక్రమం శనివారం (ఆగస్ట్ 9) హైదరాబాద్‌లోని పార్క్ హయత్‌లో గ్రాండ్‌గా జరిగింది. మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది ప్రముఖులు కలిసి సందడి చేశారు.

అయితే, మేల్ క్యాటగిరీలో సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ మోస్ట్ డిజైరబుల్ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డును సాయి దుర్గ తేజ్‌కు సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ప్రదానం చేశారు. ఈ అవార్డుని తల్లి విజయ దుర్గ, తండ్రి డాక్టర్ శివ ప్రసాద్ చేతుల మీదుగా తీసుకోవాలని సాయి దుర్గ తేజ్ కోరుకున్నారు.

ఇక వేదికపైనే ఈ అవార్డుని, గౌరవాన్ని సాయి దుర్గ తేజ్ తన తల్లికి అంకితం చేశారు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో తనను తల్లి తనను కంటికి రెప్పలా కాపాడుకున్నారని గుర్తు చేసు...