భారతదేశం, మే 3 -- ఆంధ్రప్రదేశ్ పునర్విభన చట్టం 94(3) సెక్షన్ ప్రకారం.. నవ్యాంధ్ర నూతన రాజధాని నిర్మాణ బాధ్యత పూర్తిగా కేంద్రానిదే.. ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల స్పష్టం చేశారు. నూతన రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పన కేంద్రం కల్పించి ఇవ్వాల్సిందేనని వ్యాఖ్యానించారు. విభజన చట్టంలో కేంద్రం విధులేంటో ఇంత స్పష్టంగా పేర్కొంటే.. మరి ప్రధాని మోదీ ఇస్తున్నది ఏమిటి? అని ప్రశ్నించారు. ఆనాడు 2015లో మట్టి కొట్టారు.. నేడు సున్నం కొట్టి వెళ్లారని ఎద్దేవా చేశారు.

'10 ఏళ్ల కిందట ఏం చెప్పి ఆంధ్రులకు తీరని ద్రోహం చేశారో.. నేడు అవే అబద్ధాలను అందంగా చెప్పి ఘరానా మోసం చేశారు. మళ్లీ అభివృద్ధి చేస్తాం, భుజాలు కలుపుతాం అంటూ బూటకపు మాటలు చెప్పారు. 5 కోట్ల మంది కలల సౌధం అమరావతికి 2015 నుండి అన్ని చేశామని పచ్చి అబద్ధాలు చెప్పారు. అన్ని ఇస్తే మాకు రాజధాని నిర్మాణం ...