Hyderabad, ఏప్రిల్ 15 -- మోటివేషన్ కోసం ఎక్కడికో వెళ్లి, ఏవో మాటలు వినాల్సిన అవసరం లేదు.కళ్ల ముందు కనిపించే ప్రతీది మనల్ని మోటివేట్ చేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మీ కళ్ల ముందున్న ప్రతి వస్తువు, ప్రతి విషయం మీకు పాఠం నేర్పిస్తుంది. మీలో నేర్చుకునే మనస్సు ఉంటే, ప్రతిక్షణం ప్రకృతి పాఠశాలగా కనిపిస్తుంది. చల్లదనాన్ని తీసుకొచ్చే వర్షం, వెలుతురును మోసుకొచ్చే సూర్యోదయం, సమయాన్ని తెలిపే గడియారం ఇలా ప్రతి ఒక్కటి మరుక్షణమే కార్యార్థివై పరుగెత్తమని పురిగొల్పుతాయి.

ఇవన్నీ అర్థం కావాలంటే, యాంత్రిక జీవనం నుంచి కాస్త బయటకు వచ్చి కేవలం కళ్లతోనే కాకుండా మనస్సు తలుపులు తెరిచి ప్రతి అంశాన్ని గమనించండి. మీ భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోండి. ఉదాహరణకు మీకు మోటివేషన్ గా నిలిపే అంశాలను కొన్నింటిని మీ ముందుంచుతున్నాం. అవేంటంటే,

ప్రతి రోజు కొత్తగా ఉదయించే సూర...