భారతదేశం, జూలై 5 -- మొహర్రం 2025: ఇస్లామిక్ క్యాలెండర్‌లో అత్యంత పవిత్రమైన నెలల్లో ఒకటైన మొహర్రంను ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో పాటిస్తారు. ఈ నెలకు ముస్లిం సమాజంలో లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. మొహర్రం, ఇస్లామిక్ క్యాలెండర్‌లోని మొదటి నెల. దీని తర్వాత సఫర్, రబీ అల్-థాని, జుమాదా అల్-అవ్వల్, జుమాదా అత్-థానియా, రజబ్, షాబాన్, రంజాన్, షవ్వాల్, ధుల్ ఖదా, ధుల్ హిజ్జా నెలలు వస్తాయి.

మొహర్రం నెల పదో రోజును ఆషూరా అని పిలుస్తారు. ఈ ఏడాది జూన్ 26న నెలవంక కనిపించడంతో, జూన్ 27న మొహర్రం నెల ప్రారంభమైంది. దీని ప్రకారం, జూలై 6న ఆషూరా పాటించనున్నారు.

దేశవ్యాప్తంగా ఉన్న షియా, సున్నీ ముస్లింలకు ఆషూరా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. ప్రవక్త మోసెస్ (మూసా), ఇజ్రాయెల్ ప్రజలను ఫరో నిరంకుశత్వం నుండి కాపాడిన రోజుగా సున్నీ ముస్లింలు ఆషూరాను గుర...