భారతదేశం, సెప్టెంబర్ 11 -- ప్రశ్న:- క్షణాల్లో పర్సనల్​ లోన్​లు ఇచ్చే మొబైల్ యాప్‌లు మార్కెట్‌లో చాలానే ఉన్నాయి. కేవలం కొన్ని పత్రాలు సమర్పిస్తే చాలు, నిమిషాల్లో అప్పు మంజూరు చేస్తున్నాయి. కానీ ఈ యాప్‌ల ద్వారా లోన్ తీసుకోవడం సురక్షితమేనా? ఏ యాప్‌లు నకిలీవో, ఏవి నిజమైనవో ఎలా తెలుసుకోవాలి? దరఖాస్తు చేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఆర్థిక అవసరాలు అత్యవసరంగా ఉన్నప్పుడు ఈ యాప్‌ల ద్వారా లోన్ లేదా పర్సనల్​ లోన్​ తీసుకోవడం చాలా సులభంగా అనిపించవచ్చు. అయితే డిజిటల్ రుణాల పెరుగుదలతో పాటు కొన్ని ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయి. వినియోగదారులు వీటిపై తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలి.

ఆర్బీఐ అనుమతి ఉందా? తనిఖీ చేయండి: మీరు ఉపయోగించే యాప్ వెనుక ఉన్న సంస్థ నిజమైన రుణదాతేనా? అని నిర్ధారించుకోవడం మొదటి, అత్యంత ముఖ్యమైన చర్య. ఆ రుణదాత రిజర్వ్ బ్యాంక్ ఆ...