Hyderabad, ఆగస్టు 30 -- తెలుగులో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ కామెడీ మూవీ జిగ్రీస్. ఈ సినిమాకు హరీష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహించారు. మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి జిగ్రీస్ సినిమాను నిర్మిస్తున్నారు. జిగ్రీస్ మూవీలో కృష్ణ బురుగుల, ధీరజ్ ఆత్రేయ, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

ఇటీవల ఘనంగా జరిగిన ఈవెంట్‌లో సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా చేతుల మీదుగా జిగ్రీస్ టీజర్ రిలీజ్ అయింది. జిగ్రీస్ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. యూట్యూబ్‌లో కేవలం 3 రోజుల్లోనే 2 మిలియన్ వ్యూస్ దాటిన జిగ్రీస్ టీజర్ యువతలో మంచి బజ్ క్రియేట్ చేసింది.

ఇక తాజాగా జిగ్రీస్ సినిమా నుంచి వచ్చిన మొదటి పాటను యంగ్ హీరో కిరణ్ అబ్బవరం విడుదల చేశారు. "తిరిగే భూమి" అంటూ సాగే జిగ్రీస్ సాంగ్‌ను ఆగస్ట్ 29న కిరణ్ అబ్బ...