భారతదేశం, డిసెంబర్ 21 -- స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుకు హైదరాబాద్‌లో అభిమానుల నుంచి ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం (డిసెంబర్ 21) నగరంలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరైన సమంతను చూసేందుకు జనం భారీగా తరలివచ్చారు. అయితే, ఒక్కసారిగా అభిమానులు ఆమెపైకి దూసుకురావడంతో అక్కడ తీవ్ర గందరగోళం నెలకొంది.

సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోల ప్రకారం.. పట్టుచీరలో ఎంతో హుందాగా ఈవెంట్‌కు వచ్చిన సమంత కార్యక్రమం ముగించుకుని స్టేజ్ పైనుంచి కారు వైపు వెళ్తుండగా వందలాది మంది ఆమెను చుట్టుముట్టారు. భద్రతా సిబ్బంది ఎంత ప్రయత్నించినా జనాన్ని అదుపు చేయడం కష్టంగా మారింది.

జనాల తోపులాట మధ్య సమంత కనీసం నడవలేని పరిస్థితి ఏర్పడింది. ఇన్ని ఇబ్బందులు ఎదురైనా, సమంత చిరునవ్వు చెదరకుండా నిబ్బరంగా కారు వరకు చేరుకోగలిగారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ ...