భారతదేశం, సెప్టెంబర్ 5 -- గత నెల రోజుల పాటు విపరీతంగా పెరిగిన ఓలా ఎలక్ట్రిక్​ షేరు ధర.. సెప్టెంబర్​ 5, శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఓలా ఎలక్ట్రిక్​ షేరు ధర ఏకంగా 6శాతం పడిపోయింది. గత రెండు సెషన్స్​లో ఈ షేరు ఏకంగా 12శాతం పతనమైంది. ఈ పతనానికి ప్రధాన కారణం.. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీలోని జపాన్‌కు చెందిన సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ తన వాటాను తగ్గించుకోవడం.

గురువారం నాడు సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్​లో సమర్పించిన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది. దీని ప్రకారం.. సాఫ్ట్‌బ్యాంక్ సంస్థ ఓలా ఎలక్ట్రిక్​లోని తమ వాటాను 17.83 శాతం నుంచి 15.68 శాతానికి తగ్గించుకుంది.

జులై 15 నుంచి సెప్టెంబర్ 2, 2025 మధ్య కాలంలో సాఫ్ట్‌బ్యాంక్ అనుబంధ సంస్థ SVF II ఆస్ట్రిచ్ (DE) LLC, ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా 94.9 మిలియన్ల ఈక్విటీ షేర్లను విక్రయించింది. ఇది ...