Hyderabad, జూన్ 13 -- బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర తెలుసు కదా. అతడు తన 71వ పెళ్లి రోజును శుక్రవారం (జూన్ 13) జరుపుకున్నాడు. 1954లో తన మొదటి భార్య ప్రకాశ్ కౌర్ ను పెళ్లి చేసుకున్నాడు. అతని తనయుడు, నటుడు బాబీ డియోల్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో ధర్మేంద్ర, ప్రకాశ్ కౌర్ పెళ్లి రోజు విషయాన్ని పోస్ట్ చేశాడు. వీళ్లిద్దరూ కలిసి తమ 71వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని, వారిద్దరూ దండలు వేసుకొని కనిపించారు.

బాబీ డియోల్ పోస్ట్ చేసిన ఫొటోలో అతని తల్లి ప్రకాశ్ కౌర్ ధర్మేంద్ర పక్కన కూర్చుని ఉంది. వారిద్దరూ కెమెరా వైపు చూస్తూ నవ్వుతున్నారు. క్యాప్షన్‌లో బాబీ ఇలా రాశారు.. "హ్యాపీ యానివర్సరీ, మా, పాపా (రెట్ హార్ట్ ఎమోజీలు)"

ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోకు పలువురు అభిమానులు, శ్రేయోభిలాషులు కామె...