భారతదేశం, మే 26 -- మైసూర్​ శాండిల్​ సోప్​.. ఈ పేరు తెలియని భారతీయుడు బహుశా ఉండకపోవచ్చు. దశాబ్దాల కాలంగా ఈ మైసూర్​ శాండిల్​ సబ్బు భారతీయుల ఇళ్లల్లో ఒక భాగంగా మారిపోయింది. చాలా మంది మొదటి ఛాయిస్​గా నిలుస్తోంది. అయితే, అసలు ఈ మైసూర్​ శాండిల్​ సబ్బు ఆలోచన ఎవరికి? ఎప్పుడు? ఎలా? వచ్చిందో మీకు తెలుసా? ఈ మైసూర్​ శాండిల్​కి 1914లో జరిగిన మొదటి ప్రపంచ యుద్ధానికి ఒక లింక్​ ఉందని మీకు తెలుసా?

1914లో మొదటి ప్రపంచ యుద్ధం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా సప్లై చెయిన్​ వ్యవస్థ దారుణంగా దెబ్బతింది. ఆ ప్రభావం ఇండియా మీద కూడా పడింది. 1916 వచ్చేసరికి శాండిల్​వుడ్​ ఎగుమతులు విపరీతంగా పడిపోయాయి. స్టాక్​ చాలా పెరిగిపోయింది.

మిగిలిపోయిన స్టాక్​తో ఏం చేయాలి? అని ఆలోచనలు మొదలయ్యాయి. ఆ సమయంలోనే మైసూర్​లో ఒక శాండిల్​వుడ్​ ఆయిల్​ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలని అప్పటి మైసూరు...