భారతదేశం, జనవరి 11 -- జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల ఉండాలే కానీ డిగ్రీలు, అనుభవం అవసరం లేదని నిరూపిస్తున్నాడు కెనడాకు చెందిన యువ పారిశ్రామికవేత్త టూన్ లే. కనీసం కాలేజీ చదువు కూడా పూర్తి చేయని ఈ కుర్రాడు.. కేవలం 'యూట్యూబ్'ని గురువుగా చేసుకుని, నేడు కోట్ల రూపాయల టర్నోవర్ చేసే స్థాయికి చేరుకున్నాడు. వినడానికి సినిమా కథలా ఉన్నా.. దీని వెనుక ఐదేళ్ల కఠోర శ్రమ దాగి ఉంది.

టూన్ లే తన కెరీర్‌ను ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్‌గా ప్రారంభించాడు. 2019లో టొరంటో ఫిల్మ్ స్కూల్‌లో చేరినప్పటికీ, కేవలం నాలుగు నెలలకే అక్కడ చదువు ఆపేసి బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత యూట్యూబ్​లో ఎడిటింగ్​ నేర్చుకోవడం ప్రారంభించాడు.

"నేను నేర్చుకున్నదంతా యూట్యూబ్ నుంచే" అని అతను గర్వంగా చెబుతాడు. తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి స్థానిక వ్యాపార సంస్థల కోసం చాలా తక్కువ ధరకే వీడియోల...