Hyderabad, మే 8 -- ముఖంపై మొటిమలు, మచ్చలతో ఇబ్బంది పడుతున్న వారు ఎంతో మంది. ముఖ్యంగా అమ్మాయిలకే ఈ సమస్య ఎక్కువగా ఎదురవుతుంది. అమ్మాయిలందరూ మచ్చలేని, ప్రకాశవంతమైన ముఖం కలిగి ఉండాలని కోరుకుంటారు.

అయితే వేసవి కాలంలో పరిశుభ్రమైన చర్మాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం. మొటిమల చర్మాన్ని నిర్వహించడానికి సరైన జాగ్రత్తలు అవసరం. మచ్చలేని చర్మాన్ని పొందడానికి వీలయ్యే కొన్ని ఫేస్ ప్యాక్ ల గురించి ఇక్కడ చెప్పాము. ఇంట్లోనే తయారుచేసుకునే నేచురల్ ఫేస్ ప్యాక్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

ప్రతి ఇంట్లో తేనె, దాల్చిన చెక్క ఉంటుంది. వీటితోనే మీరు అదిరిపోయే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం రెండు టేబుల్ స్పూన్ల తేనె, ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని తీసుకోండి. తర్వాత తేనె, దాల్చిన చెక్క పొడి కలిపి మెత్తని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్...