భారతదేశం, అక్టోబర్ 29 -- ముంథా తుఫాన్ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పలు జిల్లాల్లో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. మరోవైపు తుఫాన్ తీవ్రత దాటికి పంట నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా వాటిల్లుతోంది. అయితే తాజాగా ఐఎండీ ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. కొన్ని జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది.

మరోవైపు ఇవాళ తెలంగాణలోని ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ అయ్యాయి.

ఇక ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి జిల్లాల్లో భారీ వర్షాలు...