Hyderabad, జూలై 10 -- యూట్యూబ్‌లో చాలా పాపులర్ అయిన సిరీస్‌లలో మై విలేజ్ షో ఒకటి. ఈ సిరీస్‌తో బిగ్ బాస్ గంగవ్వ, యూట్యూబర్ అనిల్ గీలా మంచి పాపులారిటి కూడా తెచ్చుకున్నారు. వరల్డ్ ఫేమస్ లవర్ మూవీతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిల్ జీలా ఇప్పుడు ఓటీటీ సిరీస్‌తో అలరించనున్నాడు.

అనిల్ గీలా ఓటీటీ ఎంట్రీ ఇస్తున్న వెబ్ సిరీస్ మోతెవరి లవ్ స్టోరీ. తెలంగాణ రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్, కామెడీ ప్రధాన అంశాలుగా తెరకెక్కింది మోతెవరి లవ్ స్టోరీ. అనిల్ జీలా, వర్షిణి రెడ్డి జున్నుతుల ప్రధాన పాత్రలు పోషించిన ఈ సిరీస్‌కు శివకృష్ణ బుర్రా దర్శకత్వం వహించారు.

తాజాగా మోతెవరి ఓటీటీ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. జీ5లో ఆగస్ట్ 8 మోతెవరి లవ్ స్టోరీ ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో జూలై 9న మోతెవరి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు...