భారతదేశం, జనవరి 14 -- మేడారం జాతరకు హాజరయ్యే భక్తుల సౌలభ్యం కోసం ప్రభుత్వం టెక్నాలజీని ఉపయోగిస్తోంది. భక్తులు వెంటనే నమ్మదగిన సమాచారాన్ని అందించే లక్ష్యంతో మై మేడారం వాట్సాప్ చాట్‌బాట్ సేవను ప్రారంభించారు అధికారులు. 7658912300కు మెసేజ్ పంపడం ద్వారా భక్తులు రూట్లు, ట్రాఫిక్ అప్డేట్స్, వైద్య శిబిరాల సమాచారం, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు, ఫిర్యాదు డెస్క్, తప్పిపోయిన వ్యక్తుల వివరాలు వంటి అనేక రకాల ముఖ్యమైన సేవలను పొందవచ్చు. చాట్‌బాట్ యూజర్ ఫ్రెండ్లీగా తయారు చేశారు. భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా రియల్-టైమ్ సహాయం పొందేందుకు వీలు కల్పిస్తుంది.

రెండేళ్లకు ఒకసారి జరిగే గిరిజన పండుగ సందర్భంగా మేడారం సందర్శించే లక్షలాది మంది భక్తుల భద్రత, సౌకర్యాన్ని నిర్ధారించడానికి, జనసమూహ నిర్వహణను మెరుగుపరచడానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకునే ప్రయత్నాలల...