Telangana,warangal, ఏప్రిల్ 19 -- మీ ఇంట్లో ఎవరైనా మైనర్లు బండ్లు నడుపుతున్నారా..? లైసెన్స్ లేని మేజర్లకైనా బండ్లు ఇచ్చి బయటకు పంపిస్తున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. మైనర్ డ్రైవింగ్ తో పాటు లైసెన్స్ లేని వాహనదారులపై వరంగల్ పోలీసులు కొరఢా ఝుళిపిస్తున్నారు. మైనర్లు వెహికిల్స్ నడిపినా.. వారిని ప్రోత్సహిస్తూ వెహికిల్స్ అందజేసినా చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ఈ ఏడాది జనవరి నుంచి స్పెషల్ డ్రైవ్స్ స్టార్ట్ చేసి, మైనర్లు, లైసెన్స్ లేకుండా వెహికిల్స్ నడిపిన వారిపై కేసులు నమోదు చేస్తున్నారు.

ఇటీవల కాలంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అందులో చాలా వరకు స్వయం తప్పిదాల కారణంగానే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా మైనర్లకు బండ్లు ఇవ్వడం వల్ల ఓవర్ స్పీడ్ తో నడుపుతుండటం, లైసెన్స్ లేని వాళ్లు కనీ...