భారతదేశం, నవంబర్ 24 -- ప్రస్తుతం మైథలాజికల్ టచ్ ఉన్న పాయింట్‌తో వచ్చే చిత్రాలకు మంచి డిమాండ్ ఉంటోంది. ఆడియెన్స్ కూడా ఈ ఫిక్షనల్ జోనర్ చిత్రాలను ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే బ్యూటిపుల్ హీరోయిన్ శ్రద్ధా దాస్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా త్రికాల.

రిత్విక్ వేట్షా సమర్పణలో రాధిక, శ్రీనివాస్ నిర్మాతలుగా శ్రీ సాయిదీప్ చాట్లా, వెంకట్ రమేష్ దాడి సహ నిర్మాతలుగా 'త్రికాల' సినిమాను రూపొందిస్తున్నారు. ఈ మూవీకి మణి తెల్లగూటి దర్శకత్వం వహిస్తున్నారు. త్రికాల సినిమాలో శ్రద్దా దాస్‌తోపాటు మాస్టర్ మహేంద్రన్, అజయ్, సాహితి అవంచ, సీనియర్ హీరోయిన్ ఆమని, ప్రభాకర్, అంబటి అర్జున్, రౌడీ రోహిణి వంటి వారు ముఖ్య పాత్రల్ని పోషించారు.

ఇప్పటికే రిలీజ్ చేసిన త్రికాల ట్రైలర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మాస్టర్ మహేంద్రన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్, న...