Hyderabad, ఆగస్టు 30 -- కుశ్ లవ్, తన్మయి హీరో హీరోయిన్లుగా దర్శకుడు వెంకట్ బులెమోని రూపొందిస్తున్న భారీ పాన్ ఇండియా మైథలాజికల్ థ్రిల్లర్ మూవీ "మయూఖం". ఈ చిత్రాన్ని సినెటేరియా మీడియా వర్క్స్ బ్యానర్‌పై శ్రీమతి శ్రీలత వెంకట్ నిర్మిస్తున్నారు.

వంద శాతం ఇన్ ఫిల్మ్ బ్రాండింగ్‌తో వస్తున్న తొలి ఇండియన్ మూవీగా "మయూఖం" అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. తాజాగా ఆగస్ట్ 29న పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది.

ముహూర్తపు సన్నివేశానికి టీ సిరీస్ మ్యూజిక్ నుంచి ప్రియాంక మన్యాల్ క్లాప్‌నివ్వగా, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుల సంఘం ప్రెసిడెంట్ వీర శంకర్ ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మూవీ టీమ్‌కు బెస్ట్ విషెస్ అందించారు.

ఈ కార్యక్రమంలో యాక్టర్ ...