Hyderabad, సెప్టెంబర్ 1 -- పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో మరోసారి తెరకెక్కుతోన్న సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. 'గబ్బర్ సింగ్' వంటి సంచలన విజయం తరువాత పవన్ కల్యాణ్-హరీష్ శంకర్ కలయికలో వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై అంచనాలు తారాస్థాయిలో ఉన్న విషయం తెలిసిందే.

అయితే, తాజాగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు(సెప్టెంబర్ 2) సందర్భంగా ఇవాళ (సెప్టెంబర్ 1) ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. త్రీ పీస్ సూట్, టోపీతో పూర్తిగా నల్లటి దుస్తులు ధరించి పవన్ కల్యాణ్ చాలా అందంగా, స్టైలిష్‌గా కనిపిస్తున్నారు.

అయితే, ఈ పోస్టర్‌లో పవన్ కల్యాణ్ పెట్టి డ్యాన్స్ పోజు స్టార్ డ్యాన్సర్ మైఖేల్ జాక్సన్ మూమెంట్‌లా ఉంది. పవన్ కల్యాణ్ అభిమానులకు ఆయన పుట్టిన రోజుకు ఒకరోజు ముందుగానే అదిరిపోయే స్పెషల్ సర్‌ప్రై...