భారతదేశం, జనవరి 14 -- భారతదేశ సబ్-కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌కు సరికొత్త ఊపునిస్తూ 'టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్' మార్కెట్​లోకి అడుగుపెట్టింది. తన బెస్ట్ సెల్లింగ్ మోడల్‌ను టాటా మోటార్స్ సరికొత్త డిజైన్, హై-టెక్ ఫీచర్లతో ముస్తాబు చేసింది. అయితే, ఈసారి పంచ్‌లో ప్రధాన ఆకర్షణ దాని 'టర్బో-పెట్రోల్' ఇంజిన్. ఈ క్రమంలో, మొదటి నుంచి గట్టి పోటీ ఇస్తున్న హ్యుందాయ్ ఎక్స్​టర్​తో పోలిస్తే, కొత్త పంచ్ ఏ మేరకు మెరుగ్గా ఉందో ఇక్కడ తెలుసుకోండి..

కొత్త టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్‌ను చూస్తే, అది పక్కా ఎస్‌యూవీ లుక్‌తో మరింత మస్క్యులర్​గా కనిపిస్తుంది. దీని ఫ్రంట్ గ్రిల్, బంపర్ డిజైన్, కొత్త 'ట్రైల్‌క్రెస్ట్' అలాయ్ వీల్స్ కారుకు ఒక అగ్రెసివ్ లుక్‌ను ఇచ్చాయి. పొడవు విషయానికొస్తే, పాత మోడల్ కంటే ఇది 49 ఎంఎం పెరిగి 3,876 ఎంఎంకి చేరింది. వెడల్పు 1,742 ఎంఎం, ఎత్తు 1,615 ఎం...