భారతదేశం, మే 14 -- టెక్ రంగంలో భారీ తొలగింపుల పరంపరను కొనసాగిస్తున్న మైక్రోసాఫ్ట్.. ఇప్పుడు మళ్లీ దాదాపు 6,000 మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయించింది. ఇది టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మొత్తం ఉద్యోగుల్లో 3% గా ఉంటుంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ ప్రకటన వెలువడింది.

2023లో మైక్రోసాఫ్ట్ దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించిన తర్వాత.. సంస్థలో ఇది రెండో అతిపెద్ద ఉద్యోగ కోత. పోటీని తట్టుకునేందుకు టెక్ దిగ్గజం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు దృష్టి సారించడంతో, ఉద్యోగుల తొలగింపు నిర్ణయం అనివార్యమైంది. గత ఏడాది జూన్ నాటికి మైక్రోసాఫ్ట్ లో 2,28,000 మంది ఫుల్ టైమ్ ఉద్యోగాలు చేస్తుండగా, వీరిలో 55 శాతం మంది అమెరికాలోనే ఉన్నారు.

ఈ రౌండు ఉద్యోగాల కోత వల్ల ఎక్కువగా ప్రభావితమైన భౌగోళిక ప్రాంతాలలో వాషింగ్టన్ ఒకటి. ఇక్కడ 1,985 మంది ఉద్యోగులను రెడ్మండ్ లోని కంపెన...