Hyderabad, మే 1 -- ఒకప్పుడు మైక్రోవేవ్ ఓవెన్ ను లగ్జరీగా భావించేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. సాధారణంగా ప్రతి ఇంట్లో మైక్రోవేవ్ కనిపిస్తుంది. ఇది ఇప్పుడు వంటగదిలోని నిత్యావసర వస్తువుల జాబితాలో చేరింది.

మైక్రోవేవ్ ఆహారాన్ని త్వరగా వండడం, త్వరగా వేడి చేయడం వంటి అనేక విషయాలను సులభతరం చేసింది. మైక్రోవేవ్ అనేది ఉద్యోగం చేసే ఆడవారికి ఒక వరం అనే చెప్పాలి. మైక్రోవేవ్ వల్ల ఎంత ప్రయోజనం ఉందో, దాన్ని ఉపయోగించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం కూడా అంతే ముఖ్యం.

మైక్రోవేవ్ లో వంట చేసేటప్పుడు అనుకోకుండా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఎక్కువే. వంట కోసం అందులో ఉంచిన ఆహార పదార్థాల నుంచి అది పేలిపోయే ప్రమాదం కూడా ఉంది. మీరు మైక్రోవేవ్ ఉపయోగిస్తుంటే ఈ భద్రతా చిట్కాలను తెలుసుకోవడం చాలా ముఖ్యం. కాబట్టి మైక్రోవేవ్ లో ఏయే వస్తువులను వండుకోవచ్చు, వేటిని వాడకూడదో ...