భారతదేశం, ఏప్రిల్ 20 -- ఈ బ్ర‌హ్మోత్స‌వాల స‌మ‌యంలో భ‌క్తులు భారీ సంఖ్యలో వస్తారని.. ఈవో ఎన్‌వీ సత్యన్నారాయణ మూర్తి వివరించారు. వైఖానస ఆగ‌మాన్ని అనుస‌రించి పాంచాహ్నిక దీక్ష‌తో ఈ ఉత్స‌వాల‌ను అంగ‌రంగ వైభ‌వంగా నిర్వ‌స్తామ‌న్నారు. ఉత్స‌వాల్లో భ‌క్తుల‌కు ఎటువంటి అసౌక‌ర్యం క‌ల‌గ‌కుండా ఏర్పాట్లు చేస్తామ‌ని, ఉత్స‌వాల సంద‌ర్భంగా ఆల‌యం, ప‌రిస‌రాలు విద్యుద్దీప కాంతుల‌తో ముస్తాబు చేస్తామ‌ని చెప్పారు.

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో చిన తిరుప‌తిగా పేరొందిన ద్వార‌కా తిరుమ‌ల.. చాలా విశిష్ట‌, ప‌విత్ర‌మైన చారిత్ర‌క పుణ్య‌క్షేత్రం. భ‌క్తుల తాకిడి నిరంత‌రం ఉంటుంది. వేలాది మంది భ‌క్తులు స్వామివారిని ద‌ర్శించుకుంటారు. కాలినడకన ప‌దుల కిలో మీట‌ర్లు న‌డిచి స్వామివారి అనుగ్ర‌హం కోసం భ‌క్తులు ప్ర‌త్యేక పూజులు చేస్తారు. ఈ పుణ్య‌క్షేత్రంలో మే 7వ తేదీ నుంచి మే 14వ తేదీ వ‌ర...