Tirumala, ఏప్రిల్ 23 -- శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవాలపై తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటన చేసింది. మే 6 నుంచి 8వ తేదీ వరకు తిరుమలలో ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. నారాయణగిరి ఉద్యానవనాల్లోని పరిణయోత్సవ మండపంలో ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు.

3 రోజుల పాటు జరుగనున్న ఈ వేడుకల్లో తొలిరోజు శ్రీ మలయప్పస్వామివారు గజవాహనం, రెండవరోజు అశ్వవాహనం, చివరిరోజు గరుడవాహనంపై వేంచేపు చేస్తారు. మరోపక్క ఉభయ నాంచారులు ప్రత్యేక పల్లకీలలో పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేస్తారు. ఆ తరువాత కల్యాణమహోత్సవం కన్నుల పండుగగా నిర్వహిస్తారు.

శ్రీ ప‌ద్మావ‌తి పరిణయోత్సవాల సంద‌ర్భంగా పలు సేవలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. మే 6 నుంచి 8వ తేదీ వరకు ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసినట్లు వెల్లడించింది.

పురాణాల ప్రకారం సుమారు ఐదు ...