భారతదేశం, మే 31 -- ఈ రోజు మే 31. మే నెల చివరి శనివారం. మరి ఈరోజు బ్యాంకులకు సెలవు ఉందా? అని కస్టమర్స్​కి సందేహాలు ఉండి ఉండొచ్చు. బ్యాంకులకు సాధారణంగా 2,4 శనివారాలు సెలవు ఉంటుంది. కానీ మే 31, 5వ శనివారం! ఫలితంగా ఈ రోజు బ్యాంకులకు సెలవు లేదు. దేశవ్యాప్తంగా బ్యాంకులు మొదటి, మూడో, ఐదో శనివారాలు పనిచేస్తాయి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం.. నెలలోని రెండు, నాల్గొవ శనివారాలతో పాటు అన్ని ఆదివారాలు బ్యాంకులకు సెలవు.

ఫలితంగా ఈ రోజు కస్టమర్లు తమ పనుల కోసం బ్యాంకులను సందర్శించవచ్చు.

వారాంతాలు కాకుండా, నివాస స్థితిని బట్టి జాతీయ, ప్రాంతీయ, మతపరమైన ఆచారాలు, పండుగల కోసం బ్యాంకులు మూతపడి ఉంటాయి.

అందువల్ల, భారతదేశంలో బ్యాంకు సెలవులు రాష్ట్రాన్ని బట్టి మారుతుంటాయని ఖాతాదారులు గుర్తుంచుకోవాలి. వారు సందర్శించే ముందు బ్యాంకు సెలవు జాబితాల కోసం స్థానిక...