Andhrapradesh,Tiruchanoor, ఏప్రిల్ 27 -- తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో మే 11వ తేదీ నుంచి వార్షిక వసంతోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. మూడు రోజుల పాటు నిర్వహించే ఈ వేడుకలు.. మే 13వ తేదీతో ముగుస్తాయి. ఈ వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.

శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక వసంత్సోవాలను పురస్కరించుకుని మే 6వ తేదీ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు.

ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేయనున్నారు. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అ...