భారతదేశం, ఏప్రిల్ 27 -- ఏప్రిల్‍లో టాలీవుడ్‍కు నిరాశ ఎదురైంది. ఆశలు పెట్టుకున్న అర్జున్ సన్నాఫ్ వైజయంతి, ఓదెల 2, జాక్ డిజాస్టర్ అయ్యాయి. మిగిలిన చిత్రాలు సరిగా పర్ఫార్మ్ చేయలేదు. దీంతో ఒక్క హిట్ లేకుండానే ఏప్రిల్ ముగిసింది. అయితే, వేసవి సెలవుల్లో కీలకమైన మే నెలపై మాత్రం భారీ అంచనాలు ఉన్నాయి. నాని 'హిట్ 3', విజయ్ దేవరకొండ 'కింగ్‍డమ్'పై హైప్ ఎక్కువగా ఉంది. హరి హర వీరమల్లు వస్తే ఇదే బిగ్గెస్ట్ రిలీజ్ అవుతుంది. సమంత నిర్మించిన శుభం చిత్రం కూడా రానుంది. మేలో థియేటర్లలో విడుదల కానున్న టాప్ తెలుగు చిత్రాలు చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'హిట్ 3' సినిమా మే 1వ తేదీన విడుదల కానుంది. శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ తెలుగు వైలెంట్ యాక్షన్ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. నాని ఫుల్ వైలెంట్ మోడ్‍లో కనిపించనున్నారు....