భారతదేశం, నవంబర్ 22 -- బుల్లితెర స్టార్ సీరియల్ గుప్పెడంత మనసు నటి జ్యోతి పూర్వజ్, పూర్వజ్, మనీష్ గిలాడ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న సినిమా "కిల్లర్". చంద్రకాంత్ కొల్లు, విశాల్ రాజ్, అర్చన అనంత్, గౌతమ్ చక్రధర్ కొప్పిశెట్టి ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

జ్యోతి పూర్వజ్ హీరోయిన్‌గా చేసిన కిల్లర్ సినిమాను థింక్ సినిమా, ఏయూ అండ్ ఐ స్టూడియోస్ బ్యానర్స్‌పై పూర్వజ్, పద్మనాభ రెడ్డి నిర్మిస్తున్నారు. ఉర్వీశ్ పూర్వజ్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. కిల్లర్ మూవీకి పూర్వజ్ దర్శకత్వం వహించారు.

త్వరలో కిల్లర్ మూవీని గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఈ క్రమంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల కిల్లర్ మూవీ నుంచి ఫైర్ అండ్ ఐస్ సాంగ్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో హీరోయిన్ జ్యోతి పూర్వజ్‌పై యాక్షన్ కొరియోగ్...