భారతదేశం, నవంబర్ 27 -- నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన లేటెస్ట్ డివోషనల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ అఖండ 2 ది తాండవం. అఖండ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీకి యాక్షన్ కొరియోగ్రాఫర్స్‌గా రామ్ లక్ష్మణ్ చేశారు. తాజాగా మీడియా ఇంటర్వ్యూలో బాలకృష్ణ నటనపై ఫైట్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ ప్రశంసలు కురిపించారు.

-బాలయ్య బాబు గారితో మేము ఎప్పటినుంచో వర్క్ చేస్తున్నాము. మేము అంటే బాబు గారికి చాలా నమ్మకం. మేము సింహ లెజెండ్ లాంటి మాస్ క్యారెక్టర్స్‌కి ఫైట్స్ డిజైన్ చేశాము. అలాంటి ఒక క్యారెక్టర్‌కి ఒక డివైన్ ఎనర్జీ తోడైతే ఎలా ఉంటుందో ఆ ఎనర్జీని తీసుకుని మేము ఇందులో ఫైట్స్ కంపోజ్ చేశాం. సినిమాలో యాక్షన్ మీరు చూస్తున్నప్పుడు గూస్‌బంప్స్ వస్తాయి.

-బాలయ్య గారు ఒక అద్భుతం. మేము మంచులో నాలుగు ఐదు కోట్లు వేసుకుని సూట్‌కి వెళ్లేవాళ్లం. బాలకృష్ణ గారు క్యారెక్టర్‌క...