Hyderabad, ఆగస్టు 29 -- తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్‌గా ఓ మార్క్ క్రియేట్ చేసుకున్నారు దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన కెరీర్‌లో 43వ సినిమాగా దర్శకత్వం వహిస్తున్న సినిమా వేదవ్యాస్. ఈ సినిమాతో సౌత్ కొరియా హీరోయిన్ జున్ హ్యూన్ జీ తెలుగులోకి పరిచయం అవుతోంది.

వేదవ్యాస్ సినిమాను కె అచ్చిరెడ్డి సమర్పణలో సాయి ప్రగతి ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ నేత కొమ్మూరి ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్నారు. నిర్మాత దిల్ రాజు, డైరెక్టర్స్ వీవీ వినాయక్, అనిల్ రావిపూడి చేతుల మీదుగా వేదవ్యాస్ సినిమా ఆగస్ట్ 28న ఘనంగా లాంచ్ అయింది.

ఈ కార్యక్రమంలో దిల్ రాజు, అనిల్ రావిపూడి, వీవీ వినాయక్, అలీ, మురళీ మోహన్, జుబేదా అలీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు అనిల్ రావిపూడితోపాటు ఇతర సెలబ్రిటీలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

"దిల్ ...