భారతదేశం, జనవరి 8 -- పశ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో గురువారం హైడ్రామా చోటుచేసుకుంది. ఐ-ప్యాక్ (I-PAC) అధినేత ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు నిర్వహించడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. "మీరు మా ఆఫీసులపై దాడులు చేస్తే.. రేపు మేము కూడా బీజేపీ కార్యాలయాలపై దాడులు చేస్తే పరిస్థితి ఏంటి?" అంటూ ఆమె నేరుగా సవాల్ విసిరారు.

కోల్‌కతాలోని ఐ-ప్యాక్ కో-ఫౌండర్, తృణమూల్ కాంగ్రెస్ ఐటీ సెల్ హెడ్ ప్రతీక్ జైన్ నివాసంలో ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్వయంగా ప్రతీక్ జైన్ ఇంటికి చేరుకున్నారు. ఈడీ సోదాలు జరుగుతున్న సమయంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడికి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. దీనిని బీజేపీ తీవ్రం...