Telangana,warangal, జూలై 2 -- ములుగు జిల్లాలో కొలువుదీరిన మేడారం సమ్మక్క, సారలమ్మపై భక్తులకు ఎంతో విశ్వాసం. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇక్కడ జరుగుతుంది. తాడ్వాయి మండల పరిధిలోని మేడారంలో ప్రతి రెండేళ్లకోసారి ఈ మహా జాతర నిర్వహిస్తారు. అయితే వచ్చే ఏడాది(2026)లో నిర్వహించే మహా జాతరకు సంబంధించి పూజారులు కీలక ప్రకటన విడుదల చేశారు. జాతర తేదీలను ప్రకటించారు.

జూలై 1వ తేదీన పూజారుల సంఘం(వడ్డెలు) అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, కార్యదర్శి చందా గోపాల్ రావు నేతృత్వంలో సంఘ సభ్యులు సమావేశమయ్యారు. మహా జాతర జరగబోయే తేదీలను ప్రకటించారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

మేడారం మహా జాతర - 2026 తేదీలపై ప్రకటన.

ఈ మేడారం జాతరలో ముఖ్యమైన ఘట్టం.. పగిడిద్దరాజను తీసుకురావడం. పగిడిద్దరాజును గిరిజన సంస్కృతి, సంప్రదాయాలతో మేడారానికి తీసుకువస్తారు. జాతరలో పగి...