భారతదేశం, జనవరి 28 -- జనవరి 28 నుండి 31 వరకు ములుగు జిల్లాలోని మేడారంలో సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు సర్వం సిద్ధమైంది. గిరిజన దేవతలు సమ్మక్క -సారలమ్మల మహా జాతరకు తెలంగాణ, పొరుగున ఉన్న ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌తోటాపుగా ఇతర రాష్ట్రాల నుండి మెుత్తం కలుపుకొని మూడు కోట్ల మంది భక్తులు హాజరవుతారని అంచనా. ప్రపంచంలోని జరిగే అతిపెద్ద గిరిజన జాతర ఇది.

జనవరి 28న సాయంత్రం 6 గంటలు ఆ సమయంలో గిరిజన పూజారులు సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను గద్దెలపైకి ప్రతిష్ఠించడంతో మహా జాతరలో కీలకఘట్టం ప్రారంభమవుతుంది. జనవరి 29న సాయంత్రం దాదాపు అదే సమయంలో సమ్మక్క చిలకలగుట్టను నుంచి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈ సమయం మేడారంలో భక్తులు ఊగిపోతుంటారు.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉత్సవానికి ఆరు నెలల క్రితమే సన్నాహాలు ప్రారంభించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 19న ...