భారతదేశం, జనవరి 13 -- మేడారం మహాజాతర 2026 కోసం భక్తులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే వనదేవతలకు మెుక్కులు చెల్లించుకుంటున్నారు. మహాజాతరకు ముందే మేడారం కిక్కిరిసిపోతోంది. మేడారం జాతర గురించి ముఖ్యమైన తేదీలు తెలుసుకుంటే.. దానికి తగ్గట్టుగా ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు. 2026లో మేడారం మహాజాతర జనవరి 28 నుంచి జనవరి 31 వరకు జరుగుతుంది.

మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18వ తేదీన ములుగు జిల్లా మేడారంలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 28వ తేదీన సమ్మక్క-సారలమ్మ మహాజాతర ప్రారంభం కానుంది. ఈసారి భిన్నంగా మేడారంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నట్టుగా సమాచారం.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు చేస్తారు. అనంతరం పలు కార్యక్రమాల్లో హాజరు అవుతార...