భారతదేశం, డిసెంబర్ 1 -- 2026లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా మేడారంలో జరుగుతున్న పనుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడారం పనులపై ఆరా తీశారు. ఆలయం దగ్గర ఉన్న చెట్లను తొలగించవద్దని ఆదేశించారు. నాణ్యత విషయంలో అస్సలు రాజీపడవద్దు, నిర్మాణ పనుల్లో విమర్శలకు అవకాశం ఇవ్వవద్దు అని స్పష్టం చేశారు.

అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కొనసాగుతున్న పనుల గురించి ముఖ్యమంత్రికి వివరించారు. ఆయన కొన్ని సూచనలు ఇచ్చారు. ఆలయం దగ్గర వరద నీరు నిలిచిపోకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అన్నారు. ఆలయం వద్ద నాలుగు వైపులా ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేయాలని, ఆలయం చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించడంతో పాటు గ్రాండ్ లుక్ ఇచ్చేలా లైటింగ్ ఏర్పాట...