భారతదేశం, జనవరి 22 -- మేడారం జాతర కోలాహలం మెుదలైంది. పెద్ద సంఖ్యలో భక్తులు వనదేవతల దర్శనానికి వస్తున్నారు. ఎత్తుబంగారం సమర్పిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అనేక రకాల ఏర్పాట్లు చేసింది. టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతోంది. మరోవైపు హెలికాప్టర్ సేవల ద్వారా కూడా మేడారం వెళ్లవచ్చు. అంతేకాదు మేడారంలో ఏరియల్ వ్యూ కోసం కూడా హెలికాప్టర్ ఎక్కవచ్చు.

మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం హెలికాప్టర్ సేవలు ప్రారంభమయ్యాయి. జనవరి 22వ తేదీ నుంచి జనవరి 31వ తేదీ దాకా ఈ సర్వీసులు కొనసాగుతాయి. హనుమకొండ నుంచి భక్తులు మేడారానికి హెలికాప్టర్‌లో వెళ్లవచ్చు. ఆకాశం నుంచి జాతర దృశ్యాలను హెలి రైడ్స్ ద్వారా వీక్షించవచ్చు.

జనవరి 31వ తేదీ వరకు ప్రతిరోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 20 నిమిషాల వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉంటాయి....