భారతదేశం, జనవరి 29 -- మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర మెుదలైంది. మహా జాతర ఊపందుకుంటున్న సమయంలో భక్తుల దగ్గర వ్యాపారులు దోచుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి. భారీ రద్దీని ఆసరాగా చేసుకుని స్థానిక విక్రేతలు, సీజనల్ వ్యాపారులు నిత్యావసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచారు. భక్తులు అవసరాల కోసం అధిక ధరలు చెల్లించడం తప్ప వేరే మార్గం లేకుండా పోతోంది.

పూజా సామాగ్రి, ఆహార పదార్థాల ధరలు అనూహ్యంగా పెంచేశారు. సాధారణంగా తక్కువ ధరకు లభించే బంగారం(బెల్లం) ఇప్పుడు కిలోకు రూ. 100 వరకు అమ్ముతున్నారు కొందరు. లీటరు వాటర్ బాటిల్ ధర ఏకంగా రూ. 30కి అమ్ముడవుతున్నాయి. దీని ఎంఆర్‌పీ రూ.20 మాత్రమే. అంటే పది రూపాయలు ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

యువత బైక్ టాక్సీ సేవలను కూడా ప్రవేశపెట్టారు. మేడారం ప్రాంతంలో ఎక్కడకు వెళ్లినా.. రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారు. చలి వాతావరణం ...