భారతదేశం, జనవరి 27 -- సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా న్యూజిలాండ్‌కు చెందిన మావోరీ గిరిజన తెగకు చెందినవారు ములుగు జిల్లాలోని మేడారాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మావోరీ తెగ బృందం వారి సాంప్రదాయ హాకా నృత్యాన్ని ప్రదర్శించింది. ఇది యుద్ధానికి వెళ్ళే ముందు గిరిజన యోధులను ప్రేరేపించడానికి సాంప్రదాయకంగా ఉపయోగించే శక్తివంతమైన ఆచార ప్రదర్శన అని చెబుతున్నారు.

అధికారుల ప్రకారం, న్యూజిలాండ్ నుండి గిరిజన తెగకు చెందినవారు రావడం వలన అంతర్జాతీయ గిరిజన సాంస్కృతిక విషయాలు తెలుస్తాయని, ఇక్కడి విషయాలు వారికి తెలుస్తాయని పేర్కొన్నారు. మేడారం జాతర సందర్శన సందర్భంగా మావోరీ తెగ బృందం వారి సాంప్రదాయ హాకా నృత్యాన్ని ప్రదర్శించింది..

మావోరీ కళాకారులతో కలిసి నృత్యం చేశారు మంత్రి సీతక్క. వారిని ప్రోత్సహించారు. మావోరీ తెగ ప్రతినిధి బృందాన్ని అంతకుముందు హృదయపూర్వకంగ...