భారతదేశం, జనవరి 26 -- ఈ ఏడాది సమ్మక్క-సారలమ్మ జాతరలో ఇప్ప పువ్వు లడ్డూలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. భక్తుల నుండి ఊహించని స్పందన లభిస్తోంది. మేడారం మహా జాతర చరిత్రలో మొదటిసారిగా ఈ లడ్డూలను సమ్మక్క-సారలమ్మ మహిళా రైతుల ఉత్పత్తుల సంఘం ఆధ్వర్యంలో తయారు చేసి విక్రయిస్తున్నారు. పోషక విలువలకు ప్రసిద్ధి చెందిన ఈ లడ్డూలు జాతర ప్రాంగణంలో వేగంగా అమ్ముడవుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు ఈ లడ్డూలను పంపిణీ చేయడంతో వీటికి మరింత ప్రాచుర్యం లభించింది. జనవరి 13న మేడారంలో సీతక్క ఈ ఇప్ప పువ్వు లడ్డూల స్టాళ్లను లాంఛనంగా ప్రారంభించారు.

జాతర ప్రాంతంలో, చుట్టుపక్కల మొత్తం 10 స్టాళ్లను ఏర్పాటు చేశారు. 250 గ్రాముల పెట్టె ధర రూ.150గా నిర్ణయించారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే అమ్మకాలు రూ3 లక్...