భారతదేశం, జనవరి 15 -- అతి పెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం జాతరకు తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. కోట్ల సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని చూస్తోంది. ఓవైపు అభివృద్ధి పనులు కూడా చివరి దశకు చేరుకున్నాయి. ఈనెల 28 నుంచి 31వ తేదీ వరకు మేడారం జాతర జరగనుంది.

మేడారం జాతర పనులను సీఎస్ రామకృష్ణారావు, ములుగు జిల్లా కలెక్టర్, పలువురు ఉన్నతాధికారులతో కలిసి మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ. ఈ ఏడాది దాదాపు మూడు కోట్ల మంది భక్తులు మేడారం జాతరకు హాజరవుతారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరగబోతుందని తెలిపారు.

"ఈసారి దాదాపు మూడు కోట్ల మంది భక్తులు జాతరకు హాజరవుతారని అంచనా వేస్తున్నాం. తదనుగుణంగా ఏర్పాట్లు చేయా...