భారతదేశం, జనవరి 16 -- అతిపెద్ద కుంభమేళ జాతరగా పేరొందిన మేడారం వేదికగా మరో అరుదైన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నెల 18న భేటీ కాబోతుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వలు జారీ అయ్యాయి.

ఈనెల 18వ తేదీన మేడారంలోని హారిత హోటల్ లో సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర కేబినెట్ భేటీ అవ్వనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మేడారం జాతర వేళ. కేబినెట్ భేటీ విశేషంగా మారింది.

ఇక సాధారణంగా రాష్ట్ర సచివాలయంలో కేబినెట్ భేటీ అవుతుంటోంది. ఈసారి సంప్రదాయానికి భిన్నంగా ఒక మారుమూల గ్రామంలో నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. అది కూడా కోట్లాది మంది భక్తులు అత్యంత విశ్వసించే మేడారం గ్రామంలో నిర్వహించాలని నిర్ణయించింది. హైదరాబాద్ కాకుండా ఓ మారుమూల గ్రామంలో కే...