భారతదేశం, జనవరి 28 -- మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర ఘనంగా ప్రారంభమైంది. మొదటి రోజు కీలకమైన సారక్క వచ్చే వేళ. మేడారమంతా కూడా భక్తజనసంద్రంగా మారిపోయింది. దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

బుధవారం సాయంత్రం గిరిజన పూజారులు.. సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజులను మేడారానికి తీసుకువచ్చారు. దీంతో ఈమే మహా జాతరలో కీలకఘట్టానికి అడుగు పడింది . రేపు సాయంత్రం దాదాపు అదే సమయంలో సమ్మక్క చిలకలగుట్టను నుంచి తీసుకువచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈ సమయం మేడారంలో భక్తులు ఊగిపోతుంటారు.

మరోవైపు సమ్మక్క-సారలమ్మ మేడారం మహాజాతర సందర్భంగా ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం చేపట్టిన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈసారి మేడారంలో తక్కువ సమయంలో దర్శనం జరుగుతోందని చెబుతున్నారు. భారీ రద్దీ ఉన్నప్పటికీ ఎక్కడా తొక్కిసలాటలు జరగకుండా, క్యూ లైన్లో ...