భారతదేశం, అక్టోబర్ 7 -- హైదరాబాద్ సీపీ వాహనదారులకు వార్నింగ్ ఇచ్చారు. ఇటీవలే డ్రంక్ అండ్ డ్రైవ్‌ విషయంలో మందుబాబులకు హెచ్చరికలు జారీ చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌పై తమ అధికారిక ట్విట్టర్ ఎక్స్ వేదికగా సీపీ సజ్జనార్ ట్వీట్ చేశారు.

మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకు కారణమై మీ జీవితానికి మీరు వెలకట్టలేని జరిమానా విధించుకోవద్దని సజ్జనార్ సూచించారు. డ్రంకెన్ డ్రైవ్‌ మీతోపాటుగా ఎన్నో కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతుందని చెప్పారు. తాగి డ్రైవింగ్ చేసే ముందు ఒకసారి ఆలోచించాలని హితవు పలికారు. మద్యం తాగి వాహనం నడిపితే.. మూల్యం తప్పదని, బాధ్యత గల పౌరులుగా మద్యం తాగి వాహనం నడపకండని తెలిపారు.

తాజాగా వాహనదారులకు మరో అంశంలో కూడా వార్నింగ్ ఇచ్చారు సజ్జనార్. డ్రైవింగ్ చేస్...