భారతదేశం, జనవరి 7 -- ఏదైనా కేసు సంబంధించిన విషయాలు ఇంగ్లీషులో ఉండటంతో చదివేందుకు, అర్థం చేసుకోవడానికి సామాన్యులకు చాలా ఇబ్బంది. న్యాయవ్యవస్థలోని పలు విషయాలు తెలుగులో సామాన్యులకు మరింత అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో సైబరాబాద్ కమిషనరేట్‌లోని దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఒక మహిళా హెడ్ కానిస్టేబుల్ పూర్తిగా తెలుగు భాషలోనే ఛార్జ్ షీట్లు దాఖలు చేయడం ద్వారా ప్రశంసలు అందుకున్నారు.

సాధారణంగా అధికారిక విధానాలలో ఇంగ్లీష్ ఆధిపత్యం కొనసాగుతుంది. పోలీసుల ఛార్జ్‌షీట్లు, ప్రభుత్వ జీవోల్లో మెుత్తం ఇంగ్లీషే. అయితే దుండిగల్ హెడ్ కానిస్టేబుల్ స్వరూప, 2025లో రెండు కేసులలో దర్యాప్తు పూర్తి చేసి అన్ని తుది నివేదికలను తెలుగులో కోర్టుకు సమర్పించారు. దీని వలన ఫిర్యాదుదారులు, స్థానికులు కేసుకు సంబంధించిన విషయాలపై మెరుగైన అవగాహన ఏర్పడింది.

బౌరంపేటలోని ఒ...